- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీలో ఘోరం..వృద్ధురాలిని రోడ్డుపై వదిలివెళ్లిన కుటుంబ సభ్యులు
వయసు పైబడ్డాక కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నబిడ్డలే రోడ్డుపై వదిలేస్తున్నారు. కనిపెంచి కావాల్సినవన్నీ ఇచ్చి ప్రేమగా చూసుకుంటే చివరికి మూడు పూటలు అన్నం పెట్టాల్సి వస్తుందనో

దిశ, వెబ్ డెస్క్: వయసు పైబడ్డాక కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నబిడ్డలే రోడ్డుపై వదిలేస్తున్నారు. కనిపెంచి కావాల్సినవన్నీ ఇచ్చి ప్రేమగా చూసుకుంటే చివరికి మూడు పూటలు అన్నం పెట్టాల్సి వస్తుందనో, ఆస్పత్రి బిల్లులు కట్టాల్సి వస్తుందనో అనాథలుగా రోడ్లపై విడిచి వెళ్లిపోతున్నారు. తాజాగా యూపీలోని అయోధ్యలో ఘోరం చోటు చేసుకుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న వృద్ధురాలిని కుటుంబ సభ్యలు నిర్మానుష్య ప్రదేశంలో వదిలివెళ్లిపోయారు. స్థానికులు గమనించి పోలసుల సహాయంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వృద్ధురాలిని కుటుంబ సభ్యులు వదిలివెళ్లిన ఘటన సీసీ టీవీలో రికార్డ్ అవ్వగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసులు కుటుంబ సభ్యుల కోసం ఆరాతీస్తున్నారు. వీడియో వైరల్ అవ్వడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. video






