- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Manmohan : రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో మన్మోహన్ స్మారక చిహ్నం !
ఢిల్లీ రాజ్‌ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయనున్నారు. దానికోసం ఆయన కుటుంబసభ్యులు ఆమోదం తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ రాజ్‌ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయనున్నారు. దానికోసం ఆయన కుటుంబసభ్యులు ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. సింగ్ స్మారక చిహ్నాన్ని కేంద్ర ప్రజా పనుల శాఖ నిర్మించనుంది. కాగా.. ఆ ప్రాంతంలో కేంద్రం త్వరలోనే ట్రస్ట్ ఏర్పాటు చేయనుంది. కాగా.. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతేడాది డిసెంబర్ 26 న చనిపోయారు. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో సింగ్ అంత్యక్రియల వివాదం తర్వాత ప్రభుత్వం ఆయన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా.. ఆ డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించింది. 2013లో సింగ్ అధ్యక్షత వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రముఖ నాయకుల స్మారక చిహ్నానికి భూమిని పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్మారక చిహ్నం కోసం భూమిని కేటాయించినప్పటికీ.. మంత్రిత్వ శాఖ రెండు నెలలకు పైగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా.. ఇప్పుడు సింగ్ ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపింది.






