- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ సంబంధం కేసులో భర్త విజయం.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
ఈ రోజుల్లో చట్టాలు దాదాపుగా మహిళలకే అనుకూలంగా ఉన్న క్రమంలో.. ఓ భర్త తన భార్య అక్రమ సంబంధంపై వేసిన కేసును గెలిచాడు.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లికి ముందు శారీరక సంబంధాలు, పెళ్లి తర్వాత వివాహేతర సంబంధాలు వంటి విషయాల్లో చట్టాలు దాదాపుగా మహిళలకే అనుకూలంగా ఉన్న క్రమంలో.. ఓ భర్త తన భార్య అక్రమ సంబంధంపై వేసిన కేసును గెలిచాడు. తనతో పెళ్లి తర్వాత కూడా భార్య మరొకరితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడంతో తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని, ఆమె చేసిన మోసానికి తన వైవాహిక జీవితం దెబ్బతిన్నదంటూ కేరళలోని పతనంతిట్ట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వేసిన పిటిషన్ ను న్యాయస్థానం విచారించి, కీలక తీర్పు వెలువరించింది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరికీ అది రెండో పెళ్లి. పెళ్లి తర్వాత కూడా తన భార్య మరొక వ్యక్తితో శారీరక సంబంధాన్ని కొనసాగించిందన్నది అతని ఆరోపణ. అంతేకాక.. పెళ్లికి ముందే తనకు తెలియకుండా ఆమె అబార్షన్ చేయించుకుందని, పెళ్లయ్యాక మరోసారి అబార్షన్ చేయించుకుందని ఆయన కోర్టుకు వెల్లడించాడు. ఈ కేసులో కోర్టు.. సదరు భార్యతో పాటు ఆమె తల్లి, సోదరులు, ఆమె స్నేహితుడిని దోషులుగా తేల్చింది. వారి పెళ్లి బంధం తెగిపోయేందుకు కుటుంబీకులు, సన్నిహితుడు కారణమయ్యారని, కుట్ర పన్నారని కోర్టు నిర్ధారించింది. పిటిషనర్ కు, అతని కుటుంబానికి పరువు నష్టం కలిగించినందుకు రూ.15 లక్షల పరిహారం, 2018 జులైలో పిటిషన్ దాఖలవ్వగా పరిహారంపై 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాక.. పెళ్లి సమయంలో వరుడి కుటుంబం సమర్పించిన 32 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా ఆమె భర్తకు తిరిగి ఇచ్చేయాలని తీర్పులో పేర్కొంది. వైవాహిక బంధం దెబ్బతినడానికి కారణమయ్యేలా మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే, వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చనే సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని ఫ్యామిలీ కోర్టు తుది తీర్పును వెలువరించింది.






