- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం మిగిల్చిన మానసిక క్షోభ.. విమానం ఎక్కాలంటే వణికిపోతున్న Air India 171 బాధితుల కుటుంబాలు!
అహ్మదాబాద్ AI 171 విమాన ప్రమాదం జరిగి ఏడాది గడుస్తున్నా బాధితుల కుటుంబాల్లో ట్రామా ఇంకా తగ్గలేదు.

దిశ, వెబ్ డెస్క్: జూన్ 12, 2025న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 'AI 171' (బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ఘోర విషాదకర ఘటనలో విమానంలో ఉన్న 242 మందికిగాను 241 మంది, నేలపై ఉన్న 19 మందితో కలిపి మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో యావత్ భారత దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిన విషయం తెలిసిందే.
ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకొని సంవత్సరం కావోస్తున్నప్పటికి.. 171 బాధితుల కుటుంబాల్లో మిగిల్చిన మానసిక క్షోభ మాత్రం ఇంకా కొనసాగుతోంది. విమాన ప్రమాదం జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా, బాధితుల కుటుంబాలలో ఆ చేదు జ్ఞాపకాలు, గుండెకోత ఇంకా తగ్గలేదు. ఆ ఘోర విపత్తు మిగిల్చిన శోకం నుండి వారు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ప్రమాదం జరిగి ఇన్నాళ్లవుతున్నా, మృతుల కుటుంబ సభ్యులలో కొందరు విమానం ఎక్కాలంటే తీవ్ర భయాందోళనలకు గురవుతుండగా.. మరికొందరు ఆ ఘోర ట్రామా (తీవ్ర మానసిక దిగ్భ్రాంతి) నుంచి బయటపడటానికి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సహాయం తీసుకుంటున్నారు.
ముగిసిపోని విషాదం..
అనేక కుటుంబాలకు, ఆనాటి ప్రమాదాన్ని కళ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షులకు, ఆ విషాదం కేవలం ఆ ప్రమాద ఘటికలతో ముగిసిపోలేదు. ఆ భయానక దృశ్యాలు వారి మనస్సుల్లో ఎంతటి లోతైన గాయాన్ని చేశాయంటే, నిత్య జీవితంలో వారు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన (Anxiety), ఫోబియాతో పోరాడుతున్నారు. సాధారణ స్థితికి రావడానికి, ఆనాటి భయాల నుండి మనస్సును మళ్లించడానికి బాధిత కుటుంబ సభ్యులు నిపుణుల వద్ద సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకుంటూ సుదీర్ఘమైన మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది.






