Mamata : నకిలీ ఓటర్లను నమోదు చేస్తున్నారు..బీజేపీపై మమత ఫైర్

by Y. Venkata Narasimha Reddy |

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల(West Bengal Assembly Elections)కు ఇంకా దాదాపుగా ఏడాది సమయముండగానే అధికార టీఎంసీ(TMC), ప్రతిపక్ష బీజేపీ(BJP)ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.

Mamata : నకిలీ ఓటర్లను నమోదు చేస్తున్నారు..బీజేపీపై మమత ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల(West Bengal Assembly Elections)కు ఇంకా దాదాపుగా ఏడాది సమయముండగానే అధికార టీఎంసీ(TMC), ప్రతిపక్ష బీజేపీ(BJP)ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. 2026లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండగా..ఇప్పటి నుంచే ఓటర్ల జాబితాలో బీజేపీ నకిలీ ఓటర్ల(Fake Voters)ను చేర్చుతోందని సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) ఆరోపించారు. ఎన్నికల కమిషన్ సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో చేర్చుతోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

ఈ వ్యవహారంపై వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాల్లో 215కుపై సీట్లలో విజయమే లక్ష్యమని మమత ప్రకటించారు. అటు బీజేపీ పార్టీ నేతలు మాత్రం మమతా ఆరోపణలను ఖండిస్తున్నారు. ఓటమి భయంతోనే మమతా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన స్పందిస్తూ 2026లో బెంగాల్ లో బీజేపీ విజయం తథ్యమన్నారు. 2019లోక్ సభ, 2021అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా బీజేపీ ఓటింగ్ శాతం 30నుంచి 40శాతంగా ఉందని..మరో 10శాతం ఓట్లు సాధిస్తే బెంగాల్ లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Next Story