- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fake station: యూపీలో ఫేక్ పోలీస్ స్టేషన్.. ఆరుగురు నిందితుల అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఫేక్ ఎంబసీ వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నకిలీ పోలీస్ స్టేషన్ బయటపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఫేక్ ఎంబసీ (Fake embassy) వ్యవహారం వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలోనే యూపీలోని నోయిడాలో నకిలీ పోలీస్ స్టేషన్ ఉదంతం బయటపడింది. నోయిడాలోని ఫేజ్ 3 ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఇంటర్నేషనల్ పోలీస్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పేరుతో నకిలీ కార్యాలయాన్ని నడుపుతున్నారు. సివిల్ సర్వెంట్స్‌లా నటిస్తూ వెబ్‌సైట్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ప్రభుత్వ అధికారులమని నమ్మించడానికి నకిలీ పత్రాలు, నకిలీ ఐడీలు, పోలీసు తరహా చిహ్నాలను ఉపయోగించి డబ్బులు వసూలు చేస్తున్నారు.
కార్యకలాపాలపై అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కార్యాలయం నుంచి ఫేక్ ఐడీలు, పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే ఆఫీస్ ప్రారంభించారని పోలీసులు తెలిపారు. ఘజియాబాద్‌లో ఇటీవల పట్టుకున్న నకిలీ ఎంబసీ కేసు తరహాలోనే సెటప్ చేశారని చెప్పారు. నిందితులు అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలో భాగమని చెప్పుకుని, ధ్రువీకరణ, విచారణల నెపంతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన విభాష్, ఆరాగ్య, బాబుల్, పింటుపాల్, సంపమ్‌డాల్, ఆశిష్‌లుగా గుర్తించారు.






