Fake parking fee: ఇక్కడ కూడా వదలడం లేదు.. మెట్రో స్టేషన్ వద్ద ఫేక్ పార్కింగ్ ఫీజు దందా బట్టబయలు

by Prasad Jukanti |   (  Updated:2025-11-22 06:04:04  IST  )

మెట్రో స్టేషన్ వద్ద ఫేక్ పార్కింగ్ ఫీజు కలకలం రేపింది.

Fake parking fee: ఇక్కడ కూడా వదలడం లేదు..  మెట్రో స్టేషన్ వద్ద ఫేక్ పార్కింగ్ ఫీజు దందా బట్టబయలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలను బురిడీ కొట్టించే ఫేక్ రాయుళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా మెట్రో స్టేషన్ వద్ద వాహనదారుల నుంచి ఫేక్ పార్కింగ్ ఫీజు వసూలు (Fake parking fee) చేస్తున్న వ్యక్తిని ఓ వాహనదారులు పట్టుకున్నాడు. దీంతో ఫేక్ పార్కింగ్ దందా బట్టబయలైంది. ఢిల్లీలోని జనక్‍పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ (Delhi Metro Station) వద్ద ఈ ఘటన వెలుగు చూడగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఈ స్టేషన్ వద్ద ఎంసీడీ పేరుతో నకిలీ పార్కిం ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే రుసుము చెల్లించే సయమంలో క్యూ ఆర్ కోడ్ ఒక వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు లింక్ అయిందనే విషయాన్ని ఓ కారు యజమాని గుర్తించి ప్రశ్నించాడు. అయినా ఇది సరైన క్యూఆర్ కోడ్ అంటూ సదరు వ్యక్తి వాహనదారుడితో వాదనకు దిగాడు. దీంతో వాహనదారులు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ మిషన్‍ను స్వాధీనం చేసుకున్నారు. అధికారికంగా జరగాల్సిన ఫీజు వసూళ్లు ఇలా అక్రమమార్గంలో కేటుగాళ్లు జేబులోకి వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో ఇటువంటి అంశాల్లో సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వీడియో

Next Story