కాక్రోచ్ పార్టీ పేరుతో భారీ మోసం.. క్షణాల్లో బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీ

by Prasad Jukanti |

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' మెంబర్‌షిప్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులు పంపిస్తూ బ్యాంక్ ఖాతాలు లూటీ చేస్తున్నారు

కాక్రోచ్ పార్టీ పేరుతో భారీ మోసం.. క్షణాల్లో బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీ
X

దిశ, డైనమిక్ బ్యూరో:

దేశ రాజకీయాల్లో కాక్రోచ్ జనతా పార్టీ సంచలనంగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరు మార్మోగుతోంది. సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఈ పార్టీ దేశవిదేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. యువతని ఇట్టే ఆకర్శిస్తున్న ఈ పార్టీ పేరుతో తాజాగా భారీ మోసం వెలుగు చూడటం కలకలం రేపుతోంది. దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా వేవ్ క్రియేట్ చేసిన ఈ కాక్రోచ్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసిన సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడ వేశారు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఫేక్ డిజిటల్ ఆర్గనైజేషన్ ముసుగులో జనాలను లూటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ లోని లూథియానాలో ఈ భారీ మోసం వెలుగు చూసింది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజల ఫోన్లలోకి లింకులు పంపిస్తున్నారు. ఇది నిజం అని నమ్మి ఆ లింకులను ఒక్క క్లిక్ తో బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీ అవుతున్నాయి. దీంతో అధికారులు ఇలాంటి నకిలీ లింకుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఊరిస్తూ ఊడ్చేస్తున్నారు:

ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ మోస్ట్ పాపులర్‍గా మారడంతో దేశవ్యాప్తంగా యువత ఈ పేరు చెబితే వైబ్రేట్ అవుతున్నారు. అయితే ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు కేటుగాళ్లు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. కాక్రోచ్ పార్టీలో మెంబర్ షిప్ కావాలంటే ఈ లింక్‍పై క్లిక్ చేయాలంటూ లింకులు పంపిస్తున్నారు. పొరపాటున ఈ లింక్‍పై క్లిక్ చేస్తే క్షణాల్లో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. మొబైల్ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. దీంతో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story