Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో నకిలీ డాక్టర్ నిర్వాకం.. ఏడుగురు మృతి

by Shamantha N |

నకిలీ డాక్టర్‌ రోగులతో చెలగాటమాడాడు. పలువురు రోగులకు గుండె ఆపరేషన్లు చేయగా. ఏడుగురు చనిపోయారు. దీంతో, అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో నకిలీ డాక్టర్ నిర్వాకం.. ఏడుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: నకిలీ డాక్టర్‌ రోగులతో చెలగాటమాడాడు. పలువురు రోగులకు గుండె ఆపరేషన్లు చేయగా. ఏడుగురు చనిపోయారు. దీంతో, అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దర్యాప్తులో అతడి నిర్వాకం బయటపడింది. మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎన్ జాన్ కెమ్ అనే వ్యక్తి ప్రముఖ కార్డియాలజిస్ట్‌గా చెప్పుకున్నాడు. అదే పేరున్న ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడిగా ధ్రువీకరణ పత్రాలు సృష్టించాడు. దామోహ్‌లోని క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో డాక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు రోగులకు హార్ట్‌ సర్జరీలు చేశాడు. కాగా, గుండె ఆపరేషన్లు చేయించుకున్న రోగుల్లో ఒకే నెలలో ఏడుగురు వ్యక్తులు చనిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ డాక్టర్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో, న్యాయవాది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా అధ్యక్షుడు దీపక్ తివారీ ఆ డాక్టర్‌పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో, కలెక్టర్‌ ఆదేశంతో దర్యాప్తు బృందం ఆ క్రిస్టియన్ మిషనరీ ఆస్పత్రిని సందర్శించింది. అక్కడున్న అన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ బ్రిటీష్ వైద్యుడు ఎన్ జాన్ కెమ్ పేరుతో అతడు నకిలీ పత్రాలు సమర్పించినట్లు తెలుసుకున్నారు. నిందితుడి పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని గుర్తించారు.

ఆయుష్మాన్ భారత్ పథకం కింద..

ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో స్పందించారు. నిందితుడు చేసిన ఆపరేషన్లకు ఆస్పత్రికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం నుంచి డబ్బు కూడా అందుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనూ అతడిపై పలు కేసులు నమోదయినట్లు గుర్తించామన్నారు. మృతులు ఏడుగురు అని బాధితులు చెప్తున్నప్పటికీ ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సర్జరీ తర్వాత మరణించిన రోగుల మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో ఆ నకిలీ డాక్టర్‌తోపాటు రోగుల మరణాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు దామోహ్ ఎస్పీ అభిషేక్ తివారీ చెప్పారు.

Next Story