బోయింగ్ ఇంధన కంట్రోల్ వ్యవస్థలో లోపాలు లేవు: ఎఫ్ఏఏ

by Phanindra |

బోయింగ్ 787 విమానాల ఇంధన కంట్రోల్ వ్యవస్థలో లోపాలు లేవని యూఎస్ ఎఫ్ఏఏ అంటోంది. ఈ భాగాలను విడదీసి మరీ పరీక్షించామని ఎఫ్ఏఏ అడ్మినిస్ట్రేటర్ చెప్పారు.

బోయింగ్ ఇంధన కంట్రోల్ వ్యవస్థలో లోపాలు లేవు: ఎఫ్ఏఏ
X

దిశ, నేషనల్ బ్యూరో: బోయింగ్ 787 విమానాల్లో ఇంధన స్విచ్‌లో ఎలాంటి లోపాలు లేవని యూఎస్‌కు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రతినిధి బ్రయాన్ బెడ్‌ఫోర్డ్ అన్నారు. కొన్నిరోజుల క్రితం ఎయరిండియాకు చెందిన ఒక బోయింగ్ 787 విమానం అహ్మదాబాద్‌లో కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 260 మంది వరకు మరణించారు.

ఈ ఘటనపై విచారణ చేస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదికలో విమానంలోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ‘రన్’ నుంచి ‘కటాఫ్’కు మారాయని పేర్కొంది. గతంలో ఈ స్విచ్‌లలో కొన్ని లోపాలున్నాయని ఎఫ్ఏఏ కూడా పేర్కొంది. ఈ క్రమంలో ఇంధన కంట్రోల్ వ్యవస్థలో లోపాల వల్లనే విమాన ప్రమాదం జరిగి ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు.

తాజాగా విస్కాన్సిన్‌లో ఒక ఎయిర్‌షోలో పాల్గొన్న ఎఫ్ఏఏ అడ్మినిస్ట్రేటర్ బ్రయాన్.. ‘బోయింగ్ ఫ్యూయల్ కంట్రోల్ యూనిట్‌లో ఎలాంటి మెకానికల్ సమస్యలు ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ విషయాన్ని మేం చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలం’ అని తెలిపారు.

బోయింగ్ విమానం నుంచి ఈ ఫ్యూయల్ యూనిట్స్‌ను విడదీసి మరీ ఎఫ్ఏఏ బృందం టెస్ట్ చేసిందని, వీటిలో ఎలాంటి సమస్యలు కనిపించలేదని ఆయన చెప్పారు. ‘ఇది అనుకోకుండా ఇంధన కంట్రోల్‌ మానిప్యులేట్ అయిన సమస్య కాదని మేం నమ్ముతున్నాం’ అన్నారు.

Next Story