F-414: భారత్‌లో ఎఫ్-414 ఇంజిన్ల ఉత్పత్తి.. త్వరలోనే అమెరికాతో డీల్ పూర్తి !

by B.Srinivas |

ఎఫ్-414 జెట్ ఇంజిన్లను సంయుక్తంగా ఉత్పత్తి చేయడానికి మార్చి నాటికి ఒప్పందం కుదుర్చుకుంటుందని హెచ్ఏఎల్ చైర్మన్ సునీల్ తెలిపారు.

F-414: భారత్‌లో ఎఫ్-414 ఇంజిన్ల ఉత్పత్తి.. త్వరలోనే అమెరికాతో డీల్ పూర్తి !
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశ తదుపరి తరం యుద్ధ విమానాల కోసం ఎఫ్-414 జెట్ ఇంజిన్లను సంయుక్తంగా ఉత్పత్తి చేయడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మార్చి నాటికి అమెరికా రక్షణ సంస్థ జీఈ ఏరోస్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంటుందని హెచ్ఏఎల్ చైర్మన్ డీకే సునీల్ (Dk sunil) తెలిపారు. ఇంజిన్ టెక్నాలజీ బదిలీకి సంబంధించి జీఈ ఏరోస్పేస్‌తో కీలకమైన చర్చలు పూర్తయ్యాయని, ఇప్పుడు ఇరుపక్షాలు ఈ ప్రాజెక్ట్ వాణిజ్య అంశాలపై దృష్టి సారించాయని చెప్పారు. మంగళవారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. సాంకేతిక బదిలీకి చెందిన విషయాలపై చర్చిస్తున్నామని, దాదాపు 80 శాతం టెక్నాలజీ బదిలీ చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ డీల్ పూర్తి చేస్తామన్నారు.

తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) మార్క్ 2, ఐదో తరం అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రారంభ నమూనాలలో జీఈ ఇంజిన్‌లను ఉపయోగిస్తామని వెల్లడించారు. కాగా, 2023లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్బంగా ఈ డీల్ ప్రకటించారు. అయితే పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. ఈ ఉమ్మడి ప్రాజెక్టు ఎంతో కీలకంగా పరిగణిస్తు్న్నారు. ఎందుకంటే ఎఫ్-414 అనేక దేశాల యుద్ధ విమానాలకు మరింత సామర్థ్యాన్ని చేకూరుస్తుంది.

Next Story