Terror Attack : ఉగ్రదాడిపై ప్రత్యక్ష సాక్షుల సంచలన నిజాలు

by Muthe.Rajitha |

జమ్ముకాశ్మీర్లో(Jammu & Kashmir) మంగళవారం ఉగ్రవాదులు దాడి(Terrorist Attack) జరిపిన సంగతి తెలిసిందే.

Terror Attack : ఉగ్రదాడిపై ప్రత్యక్ష సాక్షుల సంచలన నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లో(Jammu & Kashmir) మంగళవారం ఉగ్రవాదులు దాడి(Terrorist Attack) జరిపిన సంగతి తెలిసిందే. అనంత్ నాగ్ జిల్లా పహల్గాం(Pahalgoan)లో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులే(Tourists) లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇప్పటి వరకు 27 మంది టూరిస్టులు మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన క్షతగాత్రులు మహారాష్ట్ర, గుజరాత్, యూపీకి చెందిన వారుగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు సంచలన నిజాలు వెల్లడించారు. ఈ దాడి పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని అన్నారు.

ఆర్మీ యూనిఫామ్‌లో వచ్చిన ఏడుగురు ఉగ్రవాదులు.. బైసరన్‌లో టూరిస్టులను టార్గెట్‌ చేశారన్నారు. ట్రెక్కింగ్‌ టూర్‌కు వెళ్లిన పర్యటకులను చుట్టుముట్టి వారి ఐడీ కార్డులు చెక్‌ చేసి... పేరు, మతం అడిగి మరీ తన భర్తపై కాల్పులు జరిపారంటున్న ఓ బాధితురాలు రోధించింది. అయితే ఈ దుశ్చర్యకు పాల్పడింది తామేనని పాకిస్తాన్(Pakistan) కేంద్రంగా పనిచేస్తున్న TRF ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. ముష్కరుల ఈ కిరాతక చర్యను ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హుటాహుటిన అనంత్ నాగ్ బయల్దేరి వెళ్లారు.

Next Story