- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందగానే వచ్చాయి. వాతావరణ శాఖ అంచనాలను మించి వేగంగా కదులుతున్న ఈ రుతుపవనాల కారణంగా ఇప్పటికే సౌత్ ఇండియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందగానే వచ్చాయి. వాతావరణ శాఖ అంచనాలను మించి వేగంగా కదులుతున్న ఈ రుతుపవనాల కారణంగా ఇప్పటికే సౌత్ ఇండియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కేరళ రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ (IMD issues red alert for 11 districts) జారీ చేసింది. అలాగే మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఇచ్చింది. ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం ఎక్కడికక్కడ నిలిచి పోయింది.
ఇదిలా ఉంటే రుతుపవనాల ప్రభావంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 11 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న రాత్రి నుంచి కోయంబత్తూర్, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో నీలగిరి జిల్లాలో పలుచోట్ల రాకపోకలు నిలిపి వేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాగులు వంకలు పొంగి పొర్లడం, చెట్లు విరిగిపడటంతో.. పర్యాటకుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో స్థానిక అధికారులు పర్యాటకులకు సైతం అలర్ట్ జారీ చేశారు. తాము సూచించే వరకు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు.






