- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Singapore container ship: సింగపూర్ కంటైనర్ షిప్ లో పేలుడు.. అప్రమత్తమైన భారత్
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా బెయ్ పూర్ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం సింగపూర్ కంటైనర్ నౌక (MV Wan Hai 503) లో పేలుడు సంభవించింది. దీంతో ఈ నౌకలో అగ్ని కీలలు అంటుకున్నాయి. ఉదయం 10:30 గంటల సమయంలో నౌక లోపలి డెక్కులో పేలుడు సంభవించింది.

దిశ, నేషనల్ డెస్క్ : కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా బెయ్ పూర్ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం సింగపూర్ కంటైనర్ నౌక (MV Wan Hai 503) లో పేలుడు సంభవించింది. దీంతో ఈ నౌకలో అగ్ని కీలలు అంటుకున్నాయి. ఉదయం 10:30 గంటల సమయంలో నౌక లోపలి డెక్కులో పేలుడు సంభవించింది. కొచ్చికి 315 కిలోమీటర్ల దూరంలో, బెయ్ పూర్ కు పశ్చిమ దిశలో సుమారు 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. నౌక కోలోంబో నుంచి మహారాష్ట్రలోని నహవా శేవా (ముంబయి) వైపు ప్రయాణిస్తుంది. 270 మీటర్ల పొడవు ఉన్న ఈ నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారు. ఇది జూన్ 7న కోలంబో నుంచి బయలుదేరింది, జూన్ 10న ముంబయికి చేరుకోవాల్సి ఉండగా.. అనుకోకుండా పేలుడు సంభవించింది. దీంతో అందులో ఉన్న నలుగురు సిబ్బంది గల్లంతు కాాగా.. అయిదుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
స్పందించిన భారత్
ఈ ఘటనపై వెంటనే స్పందించిన భారత నౌకాదళం, కొచ్చిలో తీరానికి చేరాల్సిన (INS Surat ) నౌకను సహాయక చర్యలకు పంపించింది. భారత తీర రక్షణ దళం (Coast Guard) ICGS రాజదూత (న్యూ మంగళూరు), ICGS అర్వేశ్ (కొచ్చి), ICGS సచేత్ (అగత్తి) నౌకలను సంఘటన స్థలానికి పంపింది. ఈ సందర్భంగా (Coast Guard Dornier) విమానాన్ని కూడా ఆ ప్రాంతానికి మళ్లించి పరిస్థితి తనిఖీ చేయనున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెస్క్యూ, అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. గత నెలలో అలప్పి తీరంలో లైబేరియా దేశానికి చెందిన ఓ నౌక మునిగిన ఘటనతో తీవ్ర పర్యావరణ సమస్యలు తలెత్తాయి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టింది.






