- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Punjab: రైతు నిరసనలకు మద్దతుగా వినూత్న వివాహం
విదేశాల్లో ఉంటున్న పంజాబ్ కు చెందిన ఓ జంట వినూత్నంగా వివాహం చేసుకుంది. రైతుల నిరసనలకు మద్దతిస్తూ ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా చేసుకున్న పెళ్లి వైరల్ గా మారింది.

దిశ, నేషనల్ బ్యూరో: విదేశాల్లో ఉంటున్న పంజాబ్ కు చెందిన ఓ జంట వినూత్నంగా వివాహం చేసుకుంది. రైతుల నిరసనలకు మద్దతిస్తూ ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా చేసుకున్న పెళ్లి వైరల్ గా మారింది. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని కారీ కలాన్ గ్రామంలో పచ్చని పైర్లలో దుర్లభ్ సింగ్ (Durlab Singh), హర్మన్ కౌర్ (Harman Kaur) జంట పెళ్లితో ఒక్కటైంది. అంతకుముందు వధువు హర్మన్ కౌర్ భారీ ఊరేగింపుతో వరుడు దుర్లభ్ ఇంటికి చేరింది. తర్వాత అక్కడి నుంచి ఊరి బయట పొలాల్లో ఏర్పాటు చేసిన పెళ్లి వేడుకకు వచ్చింది. పంటపొలాల్లనే టెంట్లు వేశారు. రంగురంగుల లైటింగ్స్ అక్కడే ఏర్పాటు చేశారు. అక్కడే బంధుమిత్రుల సమక్షంలో వధూవరులు ఒక్కటయ్యారు. అంతేకాకుండా, పెళ్లిమండపాన్ని రకరకాల మొక్కలతో అలంకరించారు. వివాహమయ్యాక, ఆ మొక్కలను బంధువులకు పంచారు. అదేవిధంగా రైతుల నినాదాలు ముద్రించిన స్వీట్ బాక్సులను పంచిపెట్టారు. రైతులు ఉత్పత్తి చేసిన తేనె సీసాలను అందజేశారు. ఢిల్లీ సరహద్దుల్లో ఎన్నో ప్రయాసలకు ఓర్చి రైతులు చేసిన ఆందోళనలే తాము పంట పొలాల్లో పెళ్లి చేసుకోవడానికి కారణమని ఆ జంట తెలిపింది. ఈ పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ యువజంటను అందరూ అభినందిస్తున్నారు. కాగా దుర్లబ్ సింగ్, హర్మన్ కౌర్‌లు ప్రస్తుతం కెనడాలో సాఫ్టవేర్ ఇంజినీర్‌లుగా పనిచేస్తున్నారు.






