Lahore: పహెల్గాం ఉగ్రదాడిలో కీలకసూత్రధారి లష్కరే తోయిబా చీఫ్

by Shamantha N |   (  Updated:2025-04-30 11:03:13  IST  )

పహెల్గాం ఉగ్రదాడితో 26/11 ముంబై పేలుళ్లలో కీలక సూత్రధారికి సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. పహెల్గాం ఉగ్రదాడికి పాల్పడింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కరులే అయనా.. దీని వెనుక ఉంది మాత్రం ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అని నిఘా వర్గాలు వెల్లడించాయి.

Lahore: పహెల్గాం ఉగ్రదాడిలో కీలకసూత్రధారి లష్కరే తోయిబా చీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడితో 26/11 ముంబై పేలుళ్లలో కీలక సూత్రధారికి సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. పహెల్గాం ఉగ్రదాడికి పాల్పడింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కరులే అయనా.. దీని వెనుక ఉంది మాత్రం ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాల వేళ హఫీజ్‌కు సంబంధించి సంచలన వార్త బయటపడింది. అతడు పాక్‌లో ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రనాయకుల తీరుకు భిన్నంగా.. హఫీజ్‌ సయీద్‌ జీవనం ఉన్నట్లు తెలుస్తోంది. అతడు లాహోర్‌లోని జోరమ్‌ తౌమ్‌ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో సామాన్యపౌరులతో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. హఫీజ్‌ నివాసం వద్ద పాక్‌ ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భవనంలో హఫీజ్‌ తన కుటుంబంతో పాటు నివసిస్తున్నారట. ఇంటిముందు ఓ ప్రైవేటు పార్క్‌, పక్కనే మసీదు, మదర్సా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కొట్టిపారేసిన పాక్

అయితే, హఫీజ్‌ సయీద్‌ పాక్‌లో బహిరంగంగా తిరుగుతున్నట్లు గత కొంతకాలంగా కథనాలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఆ దేశ ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చుతూనే ఉంది. ఉగ్ర సంస్థకు నిధులు సమకూర్చి కేసులో అతడికి 31 ఏళ్ల జైలు శిక్ష పడిందని, అతడు జైల్లోనే ఉన్నాడని బుకాయిస్తోంది. 2019లో హఫీజ్‌ అరెస్టయినట్లు కథనాలు వచ్చాయి. ఆ మధ్య హఫీజ్‌ అనుచరులు, లష్కరే ఉగ్రవాదుల వరుస హత్యలు జరిగాయి. దీంతో, అతడికి పాకిస్థాన్‌ ప్రబుత్వం భద్రత పెంచినట్లు తెలుస్తోంది. అతడి ఇంటినే సబ్‌జైలుగా మార్చినట్లు వార్తలు వినిపించాయి. కాగా.. 2008 నవంబర్ 26న ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారిగా హఫీజ్ ఉన్నాడు. అంతేకాకుండా, ఎన్నో ఉగ్ర దాడుల్లో హఫీజ్‌ సయీద్‌ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్‌ను.. ఐక్యరాజ్య సమితి కూడా ఇంటర్నేషనల్ టెర్రరిస్టుగా గా ప్రకటించింది. అతడిపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల రివార్డ్‌ ప్రకటించింది.

Next Story