- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ.. ఎన్డీఏ తరఫున బరిలో ఆ ఇద్దరు నేతలు
ఉపరాష్ట్రపతి ఎన్నికను సెప్టెంబర్ 9న నిర్వహించబోతున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఉపరాష్ట్రపతి ఎన్నికను సెప్టెంబర్ 9న నిర్వహించబోతున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ (NDA) తరఫున అభ్యర్థిని ఖరారు చేసేందుకు రేపు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ (Delhi)లోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జగత్ ప్రకాశ్ నడ్డా పాల్గొని అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై కూడా చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే, ఇప్పటికే ఆగస్టు 6న ఎన్డీఏ పక్ష నేతలంతా సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించారు. కానీ, వారు అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అప్పగించారు. ఈ పరిణామంతో ఎన్డీఏ నుంచి వైఎస్ ప్రెసిడెంట్ బరిలో నిలిచేది ఎవరా అని.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu)తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ వాది శేషాద్రి చారి (Seshadri Chari) పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం.






