- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక ట్వీట్
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా.. దేశంలో వినియోగదారుడికి భారం పడకుండా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ సామాన్య భారతీయుడిపై ఆ భారం పడకుండా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ (Hardeep Singh Puri) కొనియాడారు. ఈ మేరకు ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. అదేవిధంగా ప్రపంచ దేశాల పరిస్థితిని, భారత్ అనుసరిస్తున్న వ్యూహాన్ని వివరించారు.
ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించాలనే..
నెల రోజుల వ్యవధిలో అంతర్జాతీయ ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు పెరిగాయి తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయని అన్నారు. ఆగ్నేయాసియాలో 30 శాతం నుంచి 50శాతం, ఉత్తర అమెరికాలో 30 శాతం, ఐరోపాలో శాతం, ఆఫ్రికా దేశాల్లో 50 శాతం వరకు ధరలు పెరిగాయని తెలిపారు. కానీ, తన ప్రభుత్వ ఆర్థిక వనరులపై భారం పడినప్పటికీ ప్రధాని మోడీ భారత పౌరులను అంతర్జాతీయ ఒడిదుడుకుల నుంచి రక్షించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. గత నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అస్థిరత సమయంలో కూడా పౌరుల ప్రయోజనాలకే మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు.
ఆ ఇద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు..
ప్రస్తుతం చమురు కంపెనీలకు పెట్రోల్‌పై లీటరుకు రూ.24, డీజిల్‌పై రూ.30 మేర వస్తున్న భారీ నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం తన పన్ను ఆదాయాన్ని గణనీయంగా తగ్గించుకుందని తెలిపారు. అలాగే, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడానికి ఎగుమతి పన్నును కూడా విధించామని స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఇంతటి సాహసోపేతమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






