ధర్మస్థలి మిస్టీరియస్ మర్డర్స్.. ప్రారంభం అయిన తవ్వకాలు

by Muthe.Rajitha |

కర్ణాటక(Karnataka)లో సంచలనం రేపుతున్న ధర్మస్థలి మిస్టరీ హత్యల(Dharmasthali Mystery Murders) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ధర్మస్థలి మిస్టీరియస్ మర్డర్స్.. ప్రారంభం అయిన తవ్వకాలు
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక(Karnataka)లో సంచలనం రేపుతున్న ధర్మస్థలి మిస్టరీ హత్యల(Dharmasthali Mystery Murders) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధర్మస్థల మంజునాథ ఆలయంలో పని చేసిన మాజీ శానిటరీ కార్మికుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు.. నేత్రావతి నది ఒడ్డున తవ్వకాలు జరుపుతున్నారు. కాగా శానిటరీ వర్కర్ మృతులను పూడ్చి పెట్టిన 20 ప్రాంతాలను నిన్న గుర్తించగా.. ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు.

అయితే ధర్మస్థలలో పనిచేసిన ఒక మాజీ సానిటేషన్ కార్మికుడు (విసిల్‌బ్లోయర్).. తాను మంజునాథ ఆలయంలో పనిచేస్తున్నపుడు 1995-2014 మధ్య వందలాది మృతదేహాలను (ముఖ్యంగా మహిళలు, మైనర్లు) నేత్రావతి నది ఒడ్డున పూడ్చిపెట్టినట్టు సంచలన విషయాలను బయటపెట్టాడు. అందుకు సాక్ష్యంగా కొన్ని అస్థిపంజరాలను పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఈ ఘటనపై రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేగింది. కన్నడ సర్కార్ ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

Next Story