సరిగ్గా 25 ఏళ్ల క్రితం గుజరాత్ సీఎంగా మోడీ తొలి ప్రమాణ స్వీకారం

by Malleboina Mahesh |

భారత రాజకీయ చరిత్రలో మరో విశిష్ట మైలురాయిగా నిలిచే రోజు ఇది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం 2001లో ఈ రోజున గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు.

సరిగ్గా 25 ఏళ్ల క్రితం గుజరాత్ సీఎంగా మోడీ తొలి ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్ డెస్క్: భారత రాజకీయ చరిత్రలో మరో విశిష్ట మైలురాయిగా నిలిచే రోజు ఇది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం 2001లో ఈ రోజున గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ (Narendra Modi) తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఆయన ఓటమెరుగని నేతగా గెలుస్తూ.. వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణం చేశారు. ఈ ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఎక్స్ (Twitter) వేదికగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన తన ట్వీట్‌లో “నా తోటి భారతీయుల నిరంతర ఆశీర్వాదాలతోనే ఈ సుదీర్ఘ ప్రయాణం సాధ్యమైంది.

భారత దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, భారత అభ్యున్నతికి నా శ్రమను అంకితం చేస్తున్నాను,” అని ఆయన పేర్కొన్నారు. గత రెండున్నర దశాబ్దాలుగా నరేంద్ర మోదీ భారత రాజకీయ దిశను మారుస్తూ, అభివృద్ధి, పారదర్శకత, సుశాసనానికి ప్రతీకగా నిలిచారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రం గా మార్చిన ఆయన, దేశ ప్రధాని అయిన తర్వాత “సబ్కా సాత్, సబ్కా వికాస్” అనే సిద్ధాంతంతో భారతాన్ని ప్రపంచ వేదికపై శక్తివంతమైన దేశంగా నిలిపారు. ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, సేవాతత్వం తో నడుస్తున్న మోడీ నాయకత్వం దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

Next Story