- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistan: పాక్ కు ఐఎంఎఫ్ నిధుల మంజూరుపై అమెరికా సైనిక వ్యూహకర్త అసంతృప్తి
పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ నిధులు మంజూరు చేయడంపై అమెరికా సైనిక వ్యూహకర్త మిషెల్ రూబిన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ నిధులు మంజూరు చేయడంపై అమెరికా సైనిక వ్యూహకర్త మిషెల్ రూబిన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని పోషిస్తూ.. చైనాకు అనుచర దేశంలా ఉన్న పాక్ కు నిధులు ఇవ్వడం దారుణమన్నారు. ఈ చర్య ఓ రకంగా చైనాకు బెయిల్‌ఔట్ ఇచ్చినట్లేనని అభివర్ణించారు. ‘‘పాక్‌పై నిధులు వెచ్చించడం అంటే.. అంతర్జాతీయ ద్రవ్యనిధితో చైనాను ప్రభావవంతంగా బెయిల్ ఔట్ చేయడమే. పాకిస్థాన్ ప్రస్తుతం చైనాకు ఓ ప్రావిన్స్ లాంటిది. చైనా-పాక్ ఆర్థిక కారిడార్ ఇస్లామాబాద్‌ను 40 బిలియన్ డాలర్ల అప్పుల్లో పడేసింది’’ అని రూబిన్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ బెయిల్ ఔట్ ప్యాకేజీని ట్రంప్ కార్యవర్గం అడ్డుకోకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయ దేశాల్లో అది కూడా ఒకటన్నారు.
కుక్కలా పారిపోయింది..
భారత్‌తో నాలుగు రోజుల యుద్ధం తర్వాత పాక్ తోక ముడుచుకొన్న కుక్కలా పారిపోయిందని మిషెల్ రూబిన్ అన్నారు. కీలక ఎయిర్ బేస్‌లు దెబ్బతిని, మిలిటరీ వసతులు కోల్పోయిన తర్వాత కూడా ఆ దేశం ఇంకా తెలివితేటలను ప్రదర్శిస్తోందని ఎద్దేవా చేశారు. భారత్-పాక్ మధ్య తీవ్రస్థాయిలో సైనిక ఘర్షణ జరుగుతున్న వేళ.. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి బిలియన్ డాలర్ల రుణం ఇస్లామాబాద్‌కు మంజూరైంది. అయితే, భారత్ ఆ విషయాన్ని వ్యతిరేకించినా.. అమెరికా, మరికొన్ని దేశాల మద్దతుతో దాయాది దేశం గట్టెక్కింది. ఇకపోతే, మిషెల్ అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో వ్యూహాకర్తగా విధులు నిర్వహిస్తున్నారు. 2021 వరకు నేవల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్కూల్‌లో బోధించారు.






