బలవంతంగా ముద్దు.. వ్యక్తి నాలుక కొరికేసిన మాజీ ప్రియురాలు

by Prasad Jukanti |   (  Updated:2025-11-18 11:50:01  IST  )

కిస్ పెట్టే ప్రయత్నం చేసిన వ్యక్తికి తన మాజీ ప్రియురాలు బిగ్ షాక్ ఇచ్చింది.

బలవంతంగా ముద్దు.. వ్యక్తి నాలుక కొరికేసిన మాజీ  ప్రియురాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బలవంతంగా ముద్దు పెట్టుకోబోయిన ఓ వ్యక్తికి మాజీ ప్రియురాలు ఊహించని షాక్ ఇచ్చింది. ఎంత చెప్పినా వినకుండా మరింత రెచ్చిపోవడంతో ప్రియుడి నాలుకను (woman bites man tongue) కొరికేసింది. ఉత్తరప్రదేశ్‍లోని (Uttar Pradesh) కాన్పూర్‍లో (Kanpur) జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‍గా మారింది. దరియాపూర్ గ్రామానికి చెందిన చంపీ (35) అనే వ్యక్తికి ఇప్పటికే వివాహం అయింది. అయినా గ్రామంలోని మరో యువతితో ఎఫైర్ నడుపుతున్నాడు. కొంత కాలం వీరిద్దరి మధ్య రిలేషన్ హ్యాపీగానే సాగినా ఆ తర్వాత విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసిపోయింది. దీంతో ఆమె పేరెంట్స్ యువతికి మరో వ్యక్తితో వివాహం కుదిర్చారు. తనకు మరో వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి సదరు యువతి చంపీని దూరం పెడుతూ వస్తోంది. ఈ పరిణామంతో బాధపడిన చంపీ తన ప్రియురాలిని కలిసేందుకు తరచూ ప్రయత్నించేవాడు.

ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం ఆ యువతి పొయ్యి కోసం మట్టి సేకరించేందుకు గ్రామంలోని చెరువు కట్ట వద్దకు వెళ్లింది. ఇది గమనించిన చంపీ ఆమెను అనుసరిస్తూ చెరువు వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఒంటరిగా ఉన్న తన మాజీ ప్రియురాలిని పట్టుకుని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఆమె వద్దని ప్రతిఘటించినా వినకుండా బలవంతం చేశాడు. ఈ క్రమంలో ముద్దుపెట్టుకోవడం ప్రారంభించాడు. అతడి చర్యకు విసిగిపోయిన సదరు యువతి డిఫెన్స్ లో భాగంగా అతని నాలుకను గట్టిగా కొరికేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో నొప్పి భరించలేక చంపీ కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన చంపిని అతని కుటుంబ సభ్యులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‍కు తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కాన్పూర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story