- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సిగరెట్ అలవాటు మానండి.. అందరి ముందు ఇటలీ ప్రధాని మెలోనీతో టర్కీ ప్రెసిడెంట్ కామెంట్స్ వైరల్
మెలోనీ సిగరేట్ అలవాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ దేశాధినేతల మధ్య జరిగగే సంభాషణలు ఆసక్తిని కలిగిస్తుంటాయి. ముఖ్యంగా వారి అలవాట్లు అభిరుచులపై నేతలు పరస్పరం మాట్లాడుకునే మాటలపై అంతర్జాతీయ సమాజం ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. తాజాగా ఇజ్రాయెల్, గాజా మధ్య జరుగుతున్న శాంతి ఒప్పందం సందర్భంగా 20కి పైగా దేశాల నాయకులు ఈజిప్ట్ లో సమావేశం అయ్యారు. ఈ సమయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి (Giorgia Meloni) ఉన్న ఓ అలవాటు మానుకోవాలని ట్యునీషియా అధ్యక్షుడు కైస్ సయీద్ (Kais Saied) చేసిన సూచన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ శాంతి ఒప్పందం సందర్భంగా అనధికారికంగా ముచ్చటించుకుంటున్న సమయంలో.. కైస్ సయూద్ మెలోనితో మాట్లాడుతూ.. మీరు విమానం నుంచి కిందకు దిగుతుండటం నేను చూశాను. మీరు చాలా బాగున్నారు. కానీ నేను మిమ్మల్ని ధూమపానం మానేయించాలి (Meloni To Stop Smoking) అని మెలోనితో చెప్పారు. ఈ మాటలకు మెలోనీ సరదాగా నవ్వుతూ నాకు తెలుసు నాకు తెలుసు అన్నారు. వారి పక్కనే ఉన్న ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మెలోనితో ధూమపానం అలవాటు మానిపించడం అసాధ్యం అంటూ నవ్వాడు. మీరి మాటలతో అక్కడున్నవారంతా సరదాగా నవ్వారు. కాగా ఇటీవల జార్జియా మెలోని ఇంటర్వ్యూల ఆధారంగా రాసిన పుస్తకంలో తనకున్న ధూమపానం అలవాటు ట్యునీషియా అధ్యక్షుడు కైస్ సయీద్‍తో సహా ప్రపంచ నాయకులతో తనకు బంధం ఏర్పడటానికి సహాయపడిందని ఆమె అంగీకరించారు.
మెలోనీ అందంపై ట్రంప్ కామెంట్స్:
ఈ శాంతి ఒప్పందంపై సంతకాల సమయంలో మెలోనిపై యూఎస్ ప్రెసిడెంట్ పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె అందంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. నాకు అలా చెప్పేందుకు అనుమతి లేదు. ఎందుకంటే అలా చెబితే నా రాజకీయ జీవితం ముగుస్తుంది. కానీ నేను ఆ అవకాశాన్ని తీసుకుంటాను. మీరు అందగా ఉన్నారని అన్నారు. ఆయన మాటలతో మెలోనితో సహా అక్కడున్న వారంతా నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా మెలోనో ఒక అద్భుతమైన నాయకురాలని ప్రశంసించారు.






