EPFO అనూహ్య నిర్ణయం.. రిటైర్మెంట్ రోజే అకౌంట్‌లోకి పీఎఫ్ డబ్బులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-13 14:32:11  IST  )

EPFO అనూహ్య నిర్ణయం.. రిటైర్మెంట్ రోజే అకౌంట్‌లోకి పీఎఫ్ డబ్బులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కోట్లాది మంది చందాదారులకు భారీ ఊరటనిచ్చేలా బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ (Provident Fund) నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, విత్‌డ్రా ప్రక్రియను పూర్తిగా ఆటోమేటెడ్ (Automated) చేయనున్నట్లుగా పీఎఫ్‌ సెంట్రల్‌ కమిషనర్‌ రమేశ్‌ కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజే వారి సెటిల్‌మెంట్ నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమకానున్నాయి.

క్లెయిమ్ తిరస్కరణలకు చెక్..

ప్రస్తుతం ఉన్న విధానంలో క్లెయిమ్ అప్లికేషన్ తర్వాత అనేక సాంకేతిక కారణాలతో అవి రిజెక్ట్ అవుతున్నాయి. అయితే, కొత్తగా ప్రవేశపెడుతున్న ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా మానవ ప్రమేయం లేకుండానే డేటా వెరిఫికేషన్ (Data Verification) జరుగుతుంది. దీంతో క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం పెరగడమే కాకుండా, తప్పులు దొర్లే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఇక నుంచి రిటైర్మెంట్ నిధుల కోసం ఇకపై చందాదారులు ప్రత్యేకంగా క్లెయిమ్ ఫారాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈపీఎఫ్‌వో తన ఐటీ మౌలిక సదుపాయాలను అప్‌డేట్ చేస్తోంది. దీంతో సిస్టమ్ స్వయంగా అర్హత గల క్లెయిమ్‌లను గుర్తించి వెంటనే సెటిల్ చేయనుంది.

ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికే అన్ని వివరాలను ముందుగానే సిస్టమ్‌లో అప్‌డేట్ చేయడం వల్ల ఆఖరి రోజునే డబ్బులు పొందే వీలుంటుంది. ఈ డిజిటల్ ప్రక్రియ వల్ల జాప్యం తగ్గడంతో పాటు వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ సాంకేతిక ప్రక్రియ తుది దశలో ఉందని, త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దీనిని అమలు చేయనున్నారు. ఈపీఎఫ్‌వో (EPFO) తాజా నిర్ణయంతో లక్షలాది మంది వేతన జీవులకు, ముఖ్యంగా పదవీ విరమణ పొందే వృద్ధులకు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్నారు.

EPFO: త్వరలో ఆటోమేటెడ్ కానున్న రిటైర్‌మెంట్ ఫండ్ విత్‌డ్రా

Next Story