EPFO: త్వరలో ఆటోమేటెడ్ కానున్న రిటైర్‌మెంట్ ఫండ్ విత్‌డ్రా

by S Gopi |

దీంతో పీఎఫ్ ఖాతాదారులు దరఖాస్తు చేసిన తర్వాత సొమ్ము వారి బ్యాంక్ ఖాతాల్లోకి మరింత వేగంగా జమయ్యే అవకాశం ఉంది.

EPFO: త్వరలో ఆటోమేటెడ్ కానున్న రిటైర్‌మెంట్ ఫండ్ విత్‌డ్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం రూ.5 లక్షల వరకు అడ్వాన్స్ లేదా పాక్షిక పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా మూడు రోజుల్లో పరిష్కారమవుతున్నాయి. ఇదే విధానాన్ని రిటైర్ అయిన తర్వాత పీఎఫ్ డబ్బుల కోసం పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పూర్తి ప్రక్రియను ఆటోమేటెడ్ చేయనున్నట్లు ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి చెప్పారు. బుధవారం జరిగిన ఓ జాతీయ సదస్సులో ఆయన ఈ కీలక అప్‌డేట్‌ను వెల్లడించారు. దీంతో పీఎఫ్ ఖాతాదారులు దరఖాస్తు చేసిన తర్వాత సొమ్ము వారి బ్యాంక్ ఖాతాల్లోకి మరింత వేగంగా జమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత పీఎఫ్ ఫైనల్ సెటిల్‌మెంట్ కోసం క్లెయిమ్ దరఖాస్తు చేసుకుంటే, అధికారులు ఆ ఫైల్‌ను మాన్యువల్‌గా తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల పీఎఫ్ డబ్బులు చేతికి రావడానికి వారాలు, కొన్నిసార్లు నెలల సమయం పడుతోంది. కేవలం అత్యవసర వైద్య ఖర్చులు లేదా పెళ్లిళ్ల కోసం తీసుకునే పీఎఫ్ అడ్వాన్స్ (గరిష్టంగా రూ. 5 లక్షల వరకు) మాత్రమే ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతున్నాయి.

అంతేకాకుండా ఈపీఎఫ్ఓ మరో కీలక మార్పు దిశగా కూడా పని చేస్తోంది. ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినప్పుడు పీఎఫ్ ఖాతా బదిలీ కోసం ప్రత్యేకంగా ఫారం సమర్పించాల్సిన అవసరం లేకుండా, ఆటో-ట్రాన్స్‌ఫర్ వ్యవస్థను తీసుకురానుంది. ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే పాత పీఎఫ్ ఖాతా ఆటోమెటిక్‌గా కొత్త ఖాతాకు లింక్ అయ్యేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Next Story