EPF Interest Rate: వేతన జీవులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు

by Kema Shiva Kumar |

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేట్లపై సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (Central Board of Trustees) కీలక నిర్ణయం తీసుకుంది.

EPF Interest Rate: వేతన జీవులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేట్లపై సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (Central Board of Trustees) కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీ రేటు (Interest Rate)ను కొనసాగించాలని నిర్ణయించినట్లుగా ఈపీఎఫ్‌వో (EPFO) అధికారులు తెలిపారు. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి విధితమే. ఈ మేరకు వడ్డీ రేట్లపై సీబీటీ (CBT) సమావేశంలో తీర్మానం చేసి ఆ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వ (Central Government) ఆమోదం తరువాత వడ్డీ రేటు అధికారికంగా అమల్లో్కి రానుంది.

Next Story