ఇక ATM నుంచి ఈపీఎఫ్ విత్ డ్రా.. చందాదారులకు కీలక అప్‍డేట్

by Prasad Jukanti |

EPFO 3.0 అప్‌గ్రేడ్‌లో భాగంగా ఇకపై పీఎఫ్ డబ్బును ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఈ నెల చివరికల్లా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఇక ATM నుంచి ఈపీఎఫ్ విత్ డ్రా..  చందాదారులకు కీలక అప్‍డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు త్వరలోనే భారీ ఊరట లభించనుంది. ఇకపై పీఎఫ్ డబ్బును నేరుగా ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకునే సౌకర్యం విషయంలో ఈపీఎఫ్‍వో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా కీలక అప్ డేట్ వినిపిస్తోంది. ఏటీఎం, యూపీఐ ద్వారా డబ్బులు తీసుకునే వెసులుబాటును ఈ నెల చివరికల్లా అందుబాటులోకీ తిసుకువచ్చే అవకాశం ఉందని జాతీయమీడియాలో కథనాలు పేర్కొన్నాయి. ఈ కథనాల ప్రకారం 'ఈపీఎఫ్ఓ 3.0' అప్‌గ్రేడ్‌లో భాగంగా ఈ సరికొత్త డిజిటల్ విప్లవం ఈనెల (మే 2026) చివరికల్లా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే చందాదారులు ఇప్పటి వరకు తమ సొమ్మును విత్ డ్రా చేయాలంటే నెలల తరబడి వేచి చూడటం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఉండేవి. కానీ, ఇకపై ఆ అవసరం లేకుండా వేగంగా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండబోతోంది.

ఈపీఎఫ్ఓ 3.0 కీలక మార్పులు:

ఈపీఎఫ్‍వో డిజిటల్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించే పనిలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే ఏడాది క్రితం ఈపీఎఫ్‍వో 3.0 ను లాంచ్ చేశారు. పీఎఫఅ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, యూజర్ ఫ్రెండ్లీగా పీఎఫ్ ప్రక్రియను మార్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. 2026 మధ్య నాటికి ఈ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి రాబోతోంంది. గతంలో ఉన్న సంక్లిష్టమైన 13 రకాల ఉపసంహరణ నిబంధనలను ఈపీఎఫ్ఓ కేవలం మూడు ప్రధాన వర్గాలుగా కుదించింది.

Next Story