పోర్న్‌కు బానిసై.. మహిళల లోదుస్తులు కొట్టేస్తున్న టెకీ.. కర్ణాటకలో షాకింగ్ ఘటన

by Ramesh Naini |   (  Updated:2025-03-21 05:54:08  IST  )

కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో 25 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

పోర్న్‌కు బానిసై.. మహిళల లోదుస్తులు కొట్టేస్తున్న టెకీ.. కర్ణాటకలో షాకింగ్ ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో (Karnataka)ని బెంగళూరు శివార్లలో 25 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తుమకూరులో ఎస్ఐటీ సమీపంలోని అద్దె ఇళ్లలో గత కొన్ని రోజులుగా దండెంపై ఆరేసిన మహిళల, బాలికల లోదుస్తులు కనిపించకుండా పోయాయి. ఈ విషయాన్ని మహిళలు తమ భవన యజమానికి తెలియజేశారు. దీంతో యజమాని న్యూ ఎక్స్‌టెన్షన్ పోలీసులకు సమాచారం అందించాడు. వారు వెంటనే ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా, బట్టలు ఎవరు దొంగిలిస్తున్నారో తెలుసుకోవడానికి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను తనిఖీ చేశారు.

అందులో సీసీ ఫుటేజీలో ఆసక్తికర విషయం బయటపడింది. మహిళలు, బాలికలు ఉండే ఇంటి దగ్గర ఒక వ్యక్తి బైక్ పై వచ్చి, రహస్యంగా లోదుస్తులను తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని తుమకూరులోని ఎస్ఐటీ నివాసి టెకీ శరత్‌గా గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించాడు. శరత్ పోలీసులకు పోర్న్ (porn) వీడియోలు చూసే అలవాటు ఉందని, ఆ నగరంలోని ఎస్ఐటీ ప్రాంతం, ఎస్ఎస్ పురం, అశోక్ నగర్ లలోని ఇళ్ల నుంచి కూడా లోదుస్తులను దొంగిలించానని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా శరత్ తల్లిదండ్రులు వృత్తిరీత్యా టీచర్లు అని, అతని అన్నయ్య సైతం ఇంజనీర్ అని, శరత్‌ ప్రవర్తన, పోర్న్ వ్యసనం పై తమకు తెలియదని చెబుతున్నారు. కాగా, అద్దె ఇంట్లో నివసిస్తున్న మహిళలు పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేయడానికి సిద్దంగా లేరని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో నిందితుడిని బెయిల్‌పై విడుదల చేసి, ఇకపై అలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించి వదిలేశారు.

Next Story