- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ ఐటీసీ స్కామ్‌లో సీమా హైదర్, ఆమె భర్త కూడా.. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సోదాలు
నకిలీ ఐటీసీ స్కామ్ కేసులో (Fake ITC Scam) ఈడీ (ED) అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ ఐటీసీ స్కామ్ కేసులో (Fake ITC Scam) ఈడీ (ED) అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 10 చోట్ల దాడులు చేశారు. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఈడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసినట్లుగా నకిలీ ఇన్వాయిస్ లు చూపించి.. షెల్ కంపెనీల పేరుతో రూ.650 కోట్లు బదిలీ చేసినట్లు అధికారులు తేల్చారు. ఈ స్కామ్ లో ఈ ఏడాది మే నెలలో అరెస్టైన శివకుమార్ ను ప్రధాన లబ్ధిదారుడిగా గుర్తించారు. ఈ స్కామ్ లో ఉన్న మరికొందరు వ్యక్తులు, సంస్థలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు కూడా ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.
గురువారం ఈడీ అధికారులు హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ స్కామ్ లో హవాలా వ్యాపారులు, నకిలీ కంపెనీల నెట్ వర్క్ లు మాత్రమే కాకుండా.. పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, ఆమె భారతీయ భర్త సచిన్ పేర్లను కూడా తప్పుడు రీతిలో వాడినట్లుగా దర్యాప్తులో తేలిందని ఈడీ స్పష్టం చేసింది. బిహార్ లోని దర్భంగాకు చెందిన ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లైన బ్రదర్స్ ఆశుతోష్ ఝా, విపిన్ ఝా స్కామ్ లో కీలక వ్యక్తులుగా ఉన్నారు. సీమా, సచిన్ ల ఫొటోలను వాడి.. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.99.21 కోట్లను దోచుకున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.






