- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Madhya Pradesh : మధ్యప్రదేశ్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతి
మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్(Encounter)చోటుచేసుకుంది. ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి (Three female Maoists killed)చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్(Encounter)చోటుచేసుకుంది. ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి (Three female Maoists killed)చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో వందలాది మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో హతమవుతున్నారు. మధ్యప్రదేశ్ లోనూ తాజాగా ఎన్ కౌంటర్ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది.
చత్తీస్ గడ్ రాష్ట్రంలోని అబూజ్ మడ్ అటవీ ప్రాంతం సుక్మా, దంతేవాడ, నారాయణపూర్, కాంకేర్, బస్తర్ జిల్లాల ప్రాంతాల్లో, మరికొంత భాగం ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గడ్, మహారాష్ట్ర ప్రాంతాల్లోని దండకారణ్యంలో ఉంది. చత్తీస్ గఢ్ అడవులకు సరిహద్దు రాష్ట్రంగా లేనప్పటికి మధ్యప్రదేశ్ లోనూ మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు అడపదడపా వెలుగుచూస్తు్న్నాయి.
మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో 2022, 2023సంవత్సరాల్లోనూ పలు ఎన్ కౌంటర్లు చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఏరివేత ఆపరేషన్లలో భాగంగా గత ఏడాది జరిగిన వివిధ ఎన్ కౌంటర్లలో 287మంది మావోయిస్టులు చనిపోగా..ఈ ఏడాదిలో 40రోజుల్లోనే 89మంది మావోయిస్టులు మరణించడం గమనార్హం.






