Encounter: నారాయణపూర్‌ ఎన్‌కౌంటర్‌.. పోలీసుల కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-23 04:20:50  IST  )

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా మాధ్ అడవుల్లో బుధవారం డీఆర్జీ జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయంలో తెలిసిందే.

Encounter: నారాయణపూర్‌ ఎన్‌కౌంటర్‌.. పోలీసుల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని నారాయణపూర్ (Narayanapur) జిల్లా మాధ్ (Madh) అడవుల్లో బుధవారం డీఆర్జీ జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావు (Nambala Kesava Rao)తో పాటు అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ సజ్జా నాగేశ్వర రావు (Sajja Nageshwar Rao) కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఇవాళ కీలక ప్రకటన చేశారు. మృతి చెందిన 27 మందిలో మొత్తం 14 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని తెలిపారు. మృతులను ఇప్పటికే గుర్తించామని.. పోస్ట్‌మార్టం (Postmortem) ప్రక్రియ కూడా పూర్తి చేశామని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు టీమ్‌ మొత్తం మృతి చెందారని వారు పేర్కొన్నారు. వారంతా పీఎల్‌జీఏ-7 (PLGA-7) బెటాలియన్‌ సభ్యులని..మృతులపై రూ.3.33 కోట్ల రివార్డు ఉందని అన్నారు. కీలక నేత నంబాల కేశవ రావుకు మూడంచెల భద్రత ఉండేదని పోలీసులు వెల్లడించారు.

అక్కడే నంబాల మృతదేహం..

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నంబాల కేశవరావు మృతదేహం నారాయణపూర్‌ ఆసుపత్రిలోనే ఉంది. దీంతో ఆయన డెడ్‌బాడీని అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని (Chhattisgarh Government) కోరారు. అయితే, మృతదేహం వారికి అప్పజెప్పేందుకు మరింత సమయం తీసుకోవాలనే యోచనలో ప్రభుత్వంతో పాటు పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నంబాల కేశవ రావు అంత్యక్రియలు శ్రీకాకుళం జిల్లాలో జియన్నపేటలో నిర్వహించే అవకాశం ఉంది.

Next Story