Encounter: కర్రెగుట్టల్లో భీకర ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-24 07:01:17  IST  )

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

Encounter: కర్రెగుట్టల్లో భీకర ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ (Chhattisgarh-Telangana) సరిహద్దులోని బీజాపూర్‌ జిల్లా (Bijapur District)లో ఇవాళ భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌ (Encounter)లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్ జిల్లా ధర్మ తాళ్లగూడెం కర్రె‌గుట్టల్లో మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ హిడ్మా (Hidma)తో పాటు దామోదర్ (Damodar) లాంటి అగ్ర నాయకులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అనంతరం కర్రెగుట్ట (Karregutta)ను టార్గెట్‌గా చేసుకుని 5 వేల మందితో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా (DRG Bastar Fighter Cobra), సీఆర్‌పీఎఫ్ (CRPF), ఎస్టీఎఫ్ (STF) సైనికులు భారీ కూంబింగ్ ఆపరేషన్‌‌లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా కర్రెగెట్ట దండకారణ్యంలోకి అటవీ ప్రాంతాలను కలిపే గ్రామలకు రాకపోకలను పూర్తిగా నలిపివేశారు.

ఈ క్రమంలోనే ఇవాళ మావోయిస్టు సాయుధ విభాగమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (People's Liberation Guerrilla Army)కి భద్రతా దళాలకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా హుటాహుటిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భీమవరంపాడు, పూజారీ కాంకేర్, పామేడు అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పుల మోత మోగుతూనే ఉంది. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో బేస్ క్యాంపు ఏర్పాటుకు భద్రతా బలగాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కూంబింగ్ ఆపరేషన్‌పై ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ (Vijay Sharma) ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య భారీగా పెరిగే అశకాశం ఉంది.

Next Story