Jammu & Kashmir: ఉరిలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-24 05:49:56  IST  )

జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu& Kashmir) పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకే ఉరి (Uri) జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాడుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

Jammu & Kashmir: ఉరిలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu& Kashmir) పహల్గామ్‌లో ఉగ్రదాడి (terrorist attack)కి ప్రతీకారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ముగ్గురు ఉగ్రవాదులు బారాముల్లాలోని ఉరి నాలా వద్ద ఉన్న జనరల్ ఏరియా సర్జీవన్ గుండా దేశంలోకి చోరబడేందుకు యత్నించారు. గుర్తించిన భద్రతా దళాలు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మరో ఆరుగురు ఉగ్రవాదులు దాక్కున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారంతో వారిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌ను భద్రత దళాలు అప్రమత్తం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రకటించాయి. ప్రజలు, వ్యాపార సంస్థలు, ప్రయాణికులు తమ మద్దతు తెలుపుతూ బంద్‌ను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. కాగా, పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు చనిపోయారు. వీరిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం.

click for tweet ..

Next Story