- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG Breaking : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులతో అబుజ్‌మార్ అటవీ ప్రాంతం (Abujhmarh Forest) దద్దరిల్లింది. నారాయణపూర్‌లో (Narayanapur Encounter) భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరుగుతున్న ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు (Six Maoists Encounter) తెలుస్తోంది. ఆరుగురి మృతదేహాలతో పాటు.. ఏకే 47 (AK 47), ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా.. ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టుల వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఆపరేషన్ ముగిసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ (Operation Kagar)లో భాగంగా ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించారు.






