జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-10 05:50:52  IST  )

ఆదివారం తెల్లవారుజామున భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) రాష్ట్రంలోని కిష్త్వోర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున దూల్ (Dul) ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నిఘా సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు దూల్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల (Terroist) సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. చనిపోయిన ఉగ్రవాదికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ప్రస్తుతం కిష్త్వార్‌లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.

కాగా, శనివారం కోకెర్నాగ్ ప్రాంతంలోని అహ్లాన్ గగర్మాండు అడవిలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సమయంలో అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు ఎదురుగా వస్తున్న సెర్చ్ బృందాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించగా, వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.

Next Story