- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం
by Kema Shiva Kumar |
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం కుల్గాం (Kulgam) జిల్లాలోని అఖాల్ (Akhaal) అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. దీంతో రాత్రి రంగంలోకి దిగిన ఎస్‌ఓజీ, జమ్మూకశ్మీర్ పోలీసు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ (CRPF) దళాలు ‘ఆపరేషన్ అఖాల్’ పేరుతో జాయింట్ కూబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఇవాళ ఉదయం ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతం కాగా.. మరో ఇద్దరిని ఫోర్సెస్ చుట్టుముట్టాయి. శుక్రవారం రాత్రి మొదలైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ఆర్మీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Next Story






