- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. కథువా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహమ్మద్ కమాండర్ హతమైనట్లు అధికారులు చెబుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. కథువా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహమ్మద్ కమాండర్ హతమైనట్లు అధికారులు చెబుతున్నారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నాయన్న సమాచారంతో అప్రమత్తమైన బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టింది. అధికారుల వివరాల ప్రకారం.. జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా బిల్లావర్ సమీపంలోని పర్హేటర్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ (రైజింగ్ స్టార్ కోర్ప్స్), సీఆర్పీఎఫ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భద్రతా బలగాలు ధీటుగా బదులిచ్చాయి.
ఈ పోరులో జైషే మహమ్మద్‌కు చెందిన అగ్రశ్రేణి కమాండర్ ఉస్మాన్ (అలియాస్ అబు మావియా) హతమయ్యాడు. ఇతడు గత రెండేళ్లుగా ఉధంపూర్-కథువా బెల్ట్‌లో క్రియాశీలకంగా ఉంటూ అనేక దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద నుంచి అత్యాధునిక M4 ఆటోమేటిక్ రైఫిల్‌తో పాటు భారీగా పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. హతమైన ఉస్మాన్ గతంలో రెండు సార్లు భద్రతా బలగాల నుంచి తృటిలో తప్పించుకున్నారు.
హై అలర్ట్‌లో జమ్మూకశ్మీర్
జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలను భగ్నం చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దుల గుండా చొరబాటుకు ప్రయత్నిస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో, లోయ అంతటా హై అలర్ట్ ప్రకటించారు.






