- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 22 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్- దంతెవాడ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్- దంతెవాడ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి గంగలూరు పరిధిలోని ఆండ్రి అడవుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకరంగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో దాదాపు 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఎన్‌కౌంటర్ జరిగిన చోట భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను 210 బెటాలియన్, DRG, కోబ్రా ఎస్టీఎఫ్‌కు చెందిన బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఎదురుకాల్పులు నాన్‌స్టాప్‌గా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.
Next Story






