- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Encounter: జమ్ముకశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్.. తృటిలో తప్పించుకున్న ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir)లోని కథువా జిల్లా (Kathua District)లో గురువారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య మళ్లీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగినట్లుగా ఆర్మీ అధికారులు (Army Officials) తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్ (Jammu Kashmir)లోని కథువా జిల్లా (Kathua District)లో గురువారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య మళ్లీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగినట్లుగా ఆర్మీ అధికారులు (Army Officials) తెలిపారు. గత నాలుగు రోజులుగా ఆ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ (Anti-Terrorist Operation) కొనసాగుతోందని పేర్కొన్నారు. రాజ్‌బాగ్ (Rajbhag)లోని ఘాటి జుతానా (Ghati Jutana) ప్రాంతంలో ఉదయం భద్రతా దళాలకు ఉగ్రవాదులను ఎదురుపడగా కాసేపు భీకర ఎదురుకాల్పులు జరిగాయని అన్నారు. పరిస్థితిని అంచనా వేసి అదనపు బలగాలను స్పాట్‌కు తరలించామని పేర్కొన్నారు. కానీ, అప్పటికే ఉగ్రవాదులు తృటిలో తప్పించుకున్నట్లుగా సమాచారం అందిందని తెలిపారు. ఎన్‌కౌంటర్ (Encounter)పై తాజా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు వెల్లడించారు.
కాగా, మార్చి 23 సాయంత్రం కథువా జిల్లా (Kathua District)లోని హిరానగర్ సెక్టార్ (Hiranagar Sector)లో జరిగిన ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో తప్పించుకున్న ఉగ్రవాదులే ప్రస్తుతం అదే గ్రూప్ మళ్లీ భద్రతా బలగాలకు తాసరపడిందని అన్నారు. ఆ ఎన్‌కౌంటర్‌లో ఉద్రవాదులు ఏకంగా బార్టర్ క్రాస్ చేసి దట్టమైన నర్సరీలో చొరబడగా భద్రతా దళాలు ఎదుర్కొన్నామని తెలిపారు. ఇరుపక్షాల మధ్య అరగంటకు పైగా కాల్పులు జరిగినప్పటికీ అక్కడి నుంచి టెర్రరిస్ట్‌లు తప్పించుకోగలిగారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే, 2024లో జమ్ము (Jammu) ప్రాంతంలో జరిగిన వరుస దాడులు, ఎన్‌కౌంటర్లలో 18 మంది భద్రతా సిబ్బంది, 13 మంది ఉగ్రవాదులు సహా మొత్తం 44 మంది మరణించారు.






