- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Encounter: సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు.. మరో మావోయిస్టు మృతి
‘ఆపరేషన్ కగార్’ (Operation) పేరుతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రత బలగాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. బు

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ కగార్’ (Operation) పేరుతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రత బలగాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. బుధవారం నారాయణపూర్ (Narayanapur) ఎన్‌కౌంటర్‌లో 27 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరో మావోయస్టు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సుక్మా జిల్లా కిష్టారం అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్‌ఫోర్స్, CRPF ఎలైట్ యూనిట్ అయిన కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) 210వ బెటాలియన్ జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఒక మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారని భద్రత బలగాలు వెల్లడించారు. మావోయిస్టులకు అడ్డగా మారిన సుకమా, బస్తర్ డివిజన్లలో కూబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.






