Encounter: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ.. అగ్రనేత చంద్రహాస్ అలియాస్ పాండన్న మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-23 05:50:02  IST  )

ఒడిశా- ఛత్తీస్‌గఢ్ (Odisha-Chhattisgarh) సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగింది.

Encounter: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ.. అగ్రనేత చంద్రహాస్ అలియాస్ పాండన్న మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా- ఛత్తీస్‌గఢ్ (Odisha-Chhattisgarh) సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగింది. గరియాబంద్ (Gariyaband) జిల్లా పరిధిలోని మెయిన్పురి (Moinpuri) సరిహద్దు ప్రాంతంలోని కులారి ఘాట్ (Kularighat) అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి గిరియాబంద్ డీఆర్‌జీ (Giriyaband DRG), ఒడిశా ఎస్‌వోజీ (Odisha SOG) దళాలు, 207 కోబ్రా బెటాలియన్ (207 Cobra Battalion), సీఆర్‌పీఎఫ్ (CRPF) సిబ్బంది సంయుక్తంగా కూబింగ్ ఆపరేషన్ (Cubing Operation) చేపట్టాయి. ఈ క్రమంలోనే జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర నేత హైదరాబాద్ (Hyderabad ) నగరానికి చెందిన ప్రమోద్ (Pramod) అలియాస్ చంద్రహాస్ (Chandrahas) అలియాస్ పాండు (Pandu) మృతి చెందారు. ఈ విషయాన్ని భద్రతా దళాలు కూడా అధికారికారికంగా ధృవీకరించాయి.

ఒడిశా (Odisha)తో పాటు ఈస్ట్‌ జోనల్‌ బ్యూరో ఇంఛార్జ్‌ (East Zonal Bureau Incharge)గా పనిచేసిన చంద్రహాస్‌ (Chandrahas) అలియాస్ పాండన్న (Pandanna)పై రూ.20 లక్షలకు పైగా రివార్డ్ ఉంది. అయితే, పాండు మరణం మావోయిస్టు పార్టీకి తీరని లోటని పరిశీలకులు అంటున్నారు. అబూజ్మడ్‌ (Abuzmad)లో ఎక్కువ కాలం పని చేసిన ఆయనకు ప్రతి చెట్టు, పుట్ట సుపరిచతమే. దళ సభ్యుడిగా, డిప్యూటీ కమాండర్‌గా, డివిజనల్ కమిటి సభ్యుడిగా, కార్యదర్శిగా విధులు నిర్వర్తించాడు. గిరిజనుల పక్షాన నిలబడి.. వారికి సన్నిహితంగా ఉంటూ మాడ్ ఉద్యమానికి బీజం వేశాడు. ప్రారంభంలో జననాట్య మండలిలో పని చేసిన పాండు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ డీకేఎస్ జేడీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1985లో గద్దర్ టీంలో కొంతకాలం పనిచేసిన పాండన్న ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లాడు. మాడీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పథకాలను పక్కాగా అమలు చేయడంలో కీలక పాత్ర పాండుదేనని విశ్వసనీయంగా తెలుస్తోంది.

Next Story