- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భీకర ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత మృతి
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. దంతెవాడ (Dantewada) - బీజాపూర్ (Bijapur) సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దంతెవాడ పోలీసులు ఇవాళ తెల్లవారుజాము నుంచి ఆకస్మికంగా స్పెషల్ ఆపరేషన్ (Special Operation) చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు (Maoists) తారసపడగా.. ఒక్కసారిగా పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య కొన్ని గంటల పాటు భీకరంగా ఎదురుకాల్పులకు కొనసాగాయి.
ఈ ఎన్‌కౌంటర్ (Encounter)లో మావోయిస్టు మహిళా అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతే అలియాస్ సరస్వతి తీవ్రమైన బుల్లెట్ గాయాలతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. రేణుకది వరంగల్ జిల్లా కడవెండి గ్రామం కాగా.. ఆమె 35 ఏళ్ల క్రితమే పార్టీలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో దంతెవాడ (Dantewada) పోలీసులు రేణుక మృతదేహంతో పాటు రైఫిల్ (Rifle), మందుగుండు సామగ్రి (Ammunition), బుల్లెట్లు (Bullets) స్వాధీనం చేసుకున్నట్లుగా దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ పోలీసులు వెల్లడించారు.






