Viral Video : రైలు నుంచి చెత్త బయటికి విసిరిన ఉద్యోగి.. వీడియో వైరల్

by Muthe.Rajitha |   (  Updated:2025-03-07 12:21:18  IST  )

ఓ వైపు కేంద్ర ప్రభుత్వం చెత్త రహిత దేశంగా మార్చేందుకు వందల కోట్లు ఖర్చు చేసి స్వచ్ఛ భారత్(Swacha Bharat) వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, స్వచ్ఛత కోసం ప్రజలకు పిలుపునిస్తూ ఉంటుంది.

Viral Video : రైలు నుంచి చెత్త బయటికి విసిరిన ఉద్యోగి.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ వైపు కేంద్ర ప్రభుత్వం మన దేశాన్ని చెత్తరహిత దేశంగా మార్చేందుకు వందల కోట్లు ఖర్చు చేసి స్వచ్ఛ భారత్(Swacha Bharat) వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, స్వచ్ఛత కోసం ప్రజలకు పిలుపునిస్తూ ఉండగా... మరోవైపు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు మాత్రం మాకేం సంబంధం లేదన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ చెత్తను విసిరేస్తూ(Throws Garbage), సర్వం చెత్తమయం చేస్తూ ఉంటారు. తాజాగా కేంద్ర రైల్వేశాఖకు చెందిన ఉద్యోగి(IRCTC Offiacial) చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో తీవ్ర దూమరాన్ని రేపుతోంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో సాధారణంగా రైల్వేశాఖనే భోజన సౌకర్యం కల్పిస్తూ ఉంటుంది. అయితే భోజనాంతరం ఏర్పడిన ప్లేట్లు, గ్లాసులను కలెక్ట్ చేసి, ముందుగా చెత్త బుట్టల్లో వేసి అనంతరం రీసైక్లింగ్ యూనిట్లకు పంపించాలి. కానీ అదంతా ఎవరు చేస్తారు అనుకున్నాడేమో కానీ ఓ రైల్వే ఉద్యోగి కదులున్న రైలులో నుంచి చెత్తను అమాంతం బయటికి తోసేశాడు.

అలా చేయడం తప్పని ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా.. మరెక్కడ పడేయాలంటూ తిరిగి వారినే ప్రశ్నించాడు. ఓ వైపు వీడియో తీస్తున్నా.. ఏ మాత్రం భయం లేకుండా చెత్త మొత్తాన్ని రైల్లోంచి బయటికి విసిరాడు. అయితే సదరు ప్రయాణికులు ఈ వీడియోను నెట్లో పోస్ట్ చేయగా.. ప్రభుత్వ ఉద్యగాల్లో ఉంటూ ఇవేం పనులను నెటిజన్స్ చీవాట్లు పెడుతున్నారు. సామాన్యులు ఎవరైనా ఇలా చేస్తే వారించాల్సి పోయి రైల్వే ఉద్యోగిగా నిస్సిగ్గుగా చెత్తను అలా బయటకు విసరడం ఏమిటని మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవగా.. రైల్వేశాఖ ఈ ఘటనపై సీరియస్ అయ్యింది. సదరు ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story