ఒక్క రోజూ పనిచేయకుండా రూ.26 లక్షల జీతం!

by Phanindra |

ఒక్క రోజూ పనిచేయకుండా రూ.26 లక్షల జీతం సంపాదించాడో ఉద్యోగి. కంపెనీపై కోర్టుకెళ్లి మరీ ఈ మొత్తం దక్కించుకున్నాడు.

ఒక్క రోజూ పనిచేయకుండా రూ.26 లక్షల జీతం!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒక్క రోజూ పనిచేయని ఎంప్లాయీకి ఒక కంపెనీ ఏకంగా రూ.26 లక్షల జీతం చెల్లించాల్సి వచ్చింది. అబుదాభికి చెందిన సదరు కంపెనీలో ఉద్యోగం పొందిన ఒక ఉద్యోగికి ఆఫర్ లెటర్ వచ్చింది. కానీ ఉద్యోగం మొదలు పెట్టడానికి కంపెనీ ఒప్పుకోలేదు, జీతం కూడా ఇవ్వలేదు. దీంతో తనకు 2024 నవంబరు 11 నుంచి 2025 ఏప్రిల్ 7 వరకు జీతం నిలిపివేశారంటూ కోర్టుకెక్కాడా ఎంప్లాయీ. కంపెనీలో తనకు బేసిక్ శాలరీ 7,200 యూఏఈ దీనార్లు కాగా, మొత్తం నెలకు 24 వేల దీనార్ల ప్యాకేజీ లభించిందని కోర్టుకు ఆ ఉద్యోగి తెలియజేశారు.


డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన కోర్టు.. ‘వేజ్ రిపోర్టు, కాంట్రాక్టు, ఇతరత్రా పత్రాలన్నీ పరిశీలిస్తే.. ఉద్యోగం మొదలు పెట్టడంలో అయిన ఆలస్యం కంపెనీదే అని స్పష్టంగా తెలుస్తోంది’ అని వ్యాఖ్యానించింది. సదరు ఉద్యోగి ఆఫీసుకు రాలేదని, సెలవులపై వెళ్లాడని కంపెనీ వాదించింది. కానీ ఆధారాలను మాత్రం చూపించలేకపోయింది. అయితే తను 8 రోజులు సెలవులు తీసుకున్నట్లు సదరు ఉద్యోగి అంగీకరించారు. దీంతో మొత్తం నాలుగు నెలల 18 రోజుల పనికిగానూ 1,10,400 దీనార్లు చెల్లించాలని ఆ కంపెనీని కోర్టు ఆదేశించింది.

Next Story