Emergency: భారత్ క్షిపణి దాడులు.. పాక్ పంజాబ్‌లో అత్యవసర పరిస్థితి

by B.Srinivas |

ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావీన్సులో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

Emergency: భారత్ క్షిపణి దాడులు.. పాక్ పంజాబ్‌లో అత్యవసర పరిస్థితి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) తర్వాత పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావీన్సు (Panjab Provence) లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రావీన్స్ అంతటా ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు సీఎం మరియం నవాజ్ (Mariyam navaz) వెల్లడించారు. అన్ని విద్యా సంస్థలను మూసి వేయడంతో పాటు, వైద్యుల సెలవులను రద్దు చేశారు. పంజాబ్ పోలీసులు, భద్రతా సంస్థలను హై అలర్ట్‌లో ఉంచారు. సెలవులో ఉన్న వైద్య సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. సివిల్ డిఫెన్స్‌తో సహా అన్ని సంబంధిత సంస్థల అధికారులు, సిబ్బందిని పిలిపించినట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే భారత దాడి తరువాత, పాకిస్తాన్ కూడా తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. అయితే ఎనిమిది గంటల తర్వాత దానిని పాక్షికంగా తెరవగా పలు విమాన కార్యకలాపాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

కాగా, ఆపరేషన్ సిందూర్ కింద భారత సైన్యం ఈ దాడిని నిర్వహించింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir) లోని పహెల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన సంఘటనకు ప్రతీకారంగా ఈ ఆపరేషన్ జరిగింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.

Next Story