- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Embassy: ఉనికిలో లేని దేశానికి ఏడేళ్లుగా రాయబారి.. యూపీలో వ్యక్తి అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నకిలీ రాయబార కార్యాలయం బయటపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నకిలీ రాయబార కార్యాలయం బయటపడింది. ఏడేళ్లుగా ఉనికిలో లేని వెస్ట్ ఆర్కిటికా పేరుతో నకిలీ ఎంబసీని నడుపుతున్న హర్షవర్దన్ జైన్ అనే వ్యక్తిని యూపీ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బుధవారం అరెస్ట్ చేసింది. ఆయన వద్ద నుంచి నకిలీ దౌత్య నంబర్ ప్లేట్లు కలిగిన నాలుగు కార్లు,12 నకిలీ పాస్ట్ పోర్టులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ముద్రతో ఉన్న నకిలీ పత్రాలు, రెండు నకిలీ పాన్ కార్డులు, వివిధ దేశాలు, కంపెనీలకు చెందిన 34 రబ్బరు స్టాంపులు, డూప్లికేట్ ప్రెస్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.44.7 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, వివిధ కంపెనీలకు చెందిన పత్రాలు సైతం లభ్యమయ్యాయి. హర్షవర్ధన్ ఘజియాబాద్‌లోని కవి నగర్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వెస్ట్ ఆర్కిటిక్ ఎంబసీని అక్రమంగా నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. తనకు తానే వెస్ట్ ఆర్కిటిక్ రాయబారి అని ప్రకటించుకుని కార్యకలాపాలు నడుపుతున్నాడు.
విదేశాల్లో ఉద్యోగాలు పెట్టిస్తానని మోసాలు చేసేవాడని, షెల్ కంపెనీల ద్వారా హవాలా రాకెట్ నడుపుతున్నాడని వెల్లడించారు. హర్షవర్ధన్ దౌత్య నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాల్లో ప్రయాణించేవాడని, ప్రధాని, రాష్ట్రపతి, సీనియర్ అధికారులతో ఉన్న తన మార్ఫింగ్ చేసిన ఫోటోలను ఉపయోగించి ప్రజలను నమ్మించేవాడని ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. గతంలోనూ జైన్‌పై కేసులు ఉన్నట్టు వెల్లడించారు. ఆయనపై కేసు నమోదు చేశామని తదుపరి విచారణ జరుపుతున్నామని తెలిపారు.






