- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయోధ్య రామున్ని దర్శించుకున్న ఎలాన్ మస్క్ తండ్రి
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ నేడు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో మస్క్ ప్రత్యేక పూజలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ నేడు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో మస్క్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది, నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఎర్రోల్ మస్క్ మీడియాతో మాట్లాడారు. అయోధ్య చాలా బాగుందని అన్నారు. హృదయపూర్వకంగా దేవుడిని దర్శించుకున్నానని చెప్పారు. గర్వంగా మరియు, గొప్పగా ఫీల్ అవుతున్నానని తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎర్రోల్ మస్క్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం పట్ల తనకు ఆసక్తి ఉందని అన్నారు. ప్రపంచం అంతా శివుడిని అనుకరిస్తే ప్రపంచానికి శాంతి కలుగుతుందని అభిప్రాయపడ్డారు. హిందూ ధర్మం చాలా పురాతనమైనది అని అన్నారు. భారత్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక శక్తిని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇక నేడు ఆయన అయోధ్య రామున్ని సందర్శించుకోవడంతో ఆయనకు హిందూ ధర్మంపై ఉన్న ఆసక్తి మరోసారి బయటపడింది.






