ట్రంప్ ట్యాక్స్ బిల్లుపై మరోసారి మండిపడ్డ మస్క్!

by Phanindra |

ట్రంప్ ట్యాక్స్ బిల్లుకు సెనేట్ ఆమోదం లభించింది. ఈ క్రమంలో మరోసారి ఈ బిల్లుపై ఎలాన్ మస్క్ మండిపడ్డారు.

ట్రంప్ ట్యాక్స్ బిల్లుపై మరోసారి మండిపడ్డ మస్క్!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’కు యూఎస్ సెనేట్ ఆమోదం లభించింది. మూడు గంటలపాటు ఉత్కంఠగా సాగిన ఓటింగ్‌లో చివరకు 51-49 తేడాతో బిల్లు పాసైంది. కొన్ని మార్పులతో 940 పేజీల ఈ బిల్లుకు సెనేట్ ఆమోదం తెలపడంపై బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తంచేశారు.

‘సెనేట్‌లో పాసైన డ్రాఫ్ట్ బిల్లు కొన్ని లక్షల ఉద్యోగాలను నాశనం చేస్తుంది. దేశానికి చాలా వ్యూహాత్మకమైన హాని చేస్తుంది. ఇది చాలా పిచ్చి, వినాశకరమైన బిల్లు. భవిష్యత్తులో ఎదిగే విభాగాల్లో పని చేస్తున్న పరిశ్రమలకు నష్టం చేస్తుంది. అదే టైంలో మూస పద్ధతుల్లో పనిచేసే పాత పరిశ్రమలకు లబ్ది చేకూరుస్తుంది’ అని మస్క్ విమర్శించారు.

యూఎస్ అప్పుల సీలింగ్‌ను ఈ బిల్లు ఏకంగా 5 ట్రిలియన్ డాలర్లకు చేరుస్తుందని, యూఎస్ చరిత్రలోనే ఇది ఎక్కువని, అమెరికాను అప్పుల ఊబిలోకి లాగేస్తుందని మస్క్ మండిపడ్డారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను మినహాయింపును ఈ బిల్లుతో తొలగించనున్నారు. దీంతో తన టెస్లా కంపెనీకి నష్టం జరుగుతుందనే మస్క్ ఆందోళన చెందుతున్నారని పలువురు రిపబ్లికన్లు చెప్తున్నారు.

Next Story