- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్‌లో స్టార్‌లింక్ యాక్టివేట్ చేశానన్న ఎలాన్ మస్క్
by Phanindra |
ఇరాన్‌లో స్టార్‌లింక్ యాక్టివేట్ చేశానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లో స్టార్‌లింక్ సేవలను అందుబాటులోకి వచ్చాయని టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇటీవలే దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. పరిస్థితి చక్కబడే వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండేందుకే ఇంటర్నెట్ సేవలను ఇరాన్ ప్రభుత్వం ఆపేసిందని, ఇలాంటి పరిస్థితిలో స్టార్‌లింక్‌ను ఎలాన్ మస్క్ అందుబాటులోకి తీసుకురావాలని కొందరు సోషల్ మీడియాలో కోరారు. దీనికి స్పందించిన మస్క్.. ‘ది బీమ్స్ ఆర్ ఆన్’ (ఇంటర్నెట్ యాక్టివేట్ అయింది) అని పోస్టు పెట్టారు.
Next Story






