- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మస్క్, ట్రంప్ ఫైట్ ముగిసినట్లే.. హద్దు మీరానన్న మస్క్.. కోపం లేదన్న ట్రంప్
మస్క్, ట్రంప్ ఫైట్ ముగిసినట్లే కనిపిస్తోంది. తను కొంత హద్దు మీరినట్లు మస్క్ ఒప్పుకున్నాడు. తనకు ఈ విషయంలో కోపం లేదని ట్రంప్ చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య ట్వీట్ల యుద్ధం కొలిక్కి వచ్చింది. ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ వల్ల ఈ ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మాటల యుద్ధం ‘ఎక్స్’లో హాట్ టాపిక్‌గా కూడా మారింది. ఈ నేపథ్యంలో తను కొన్ని చోట్ల హద్దుమీరానని తాజాగా మస్క్ అంగీకరించాడు. ‘గత వారంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై చేసిన కొన్ని పోస్టులు చేయకుండా ఉండాల్సింది. అవి మరీ హద్దు మీరినట్లు అనిపించింది’ అని మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు.
దీని గురించి ఒక పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడిన ట్రంప్.. మస్క్ ఇలా ప్రవర్తించినందుకు తనకేం కోపం లేదన్నాడు. ‘నాకేం కోపం లేదు. కానీ ఇదంతా జరగడం నాకు ఆశ్చర్యం కలిగించిందంతే. అద్భుతంగా తయారు చేసిన బిల్లును తను టార్గెట్ చేశాడు. ఇదంతా చేసినందుకు తను బాగా బాధపడుతున్నాడని అనుకుంటున్నా’ అని చెప్పారు. తను చాలా డిజప్పాయింట్ అయినా చేసేదేం లేదన్నారు. అయితే మళ్లీ మస్క్‌తో కలిసి పనిచేస్తారా? అని అడిగితే తను సుముఖంగానే ఉన్నట్లు చెప్పారు.
వైట్‌హౌస్ ప్రతినిధి కరోలైన్ లీవిట్ కూడా మస్క్ క్షమాపణను ట్రంప్ అభినందించారని తెలిపింది. అలాగే మస్క్‌కు చెందిన కంపెనీలతో ప్రభుత్వ కాంట్రాక్టులను పునఃసమీక్షిస్తున్నారా? అని అడిగితే అలాంటిదేం లేదని ఆమె స్పష్టంచేశారు.






